నవతెలంగాణ-భిక్కనూర్
అనారోగ్య రహిత మండలంగా తీర్చిదిద్దేందుకు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి కృషి చేయాలని మండల వైద్యాధికారి డాక్టర్ సాయి సింధు సూచించారు. సోమవారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఆశా డే సందర్భంగా ఏఎన్ఎం లకు, ఆశా వర్కర్లకు హెచ్ఐవి, ఎయిడ్స్, టీబీ, కుష్టి రోగా వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో కుష్టు రోగ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే ను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారి వెంకటరమణ, పి హెచ్ ఎన్ జనా బాయ్, ఆరోగ్య సిబ్బంది,ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm