నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంతోపాటు పెద్ద మల్లారెడ్డి,జంగంపల్లి, తిప్పాపూర్ గ్రామాలలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ నేల దినోత్సవాన్ని ఆయా గ్రామాలలో ఉన్న రైతువేదికలలో నిర్వహించారు. మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీపీ గాల్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భగవంతు రెడ్డి, ఏ డి ఏ అపర్ణ, వ్యవసాయ విస్తీర్ణ అధికారి వినోద్ గౌడ్, రైతులు పాల్గొన్నారు. జంగంపల్లి గ్రామంలో జరిగిన సమావేశంలో రైతు వేదిక అధ్యక్షుడు పుల్లూరి శివలింగం ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్సింలు యాదవ్, డిసిసిబి డైరెక్టర్ సిద్ధిరాములు, ఏ ఈ ఓ రజిత పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm