నవతెలంగాణ-రాజంపేట
సహజ వనరులను కాపాడుకోవడం మన అందరి బాధ్యత అనిమండల వ్యవసాయ అధికారిణి జ్యోత్న్స ప్రియదర్శిని అన్నారు. రాజంపేట్ మండల కేంద్రము లోని రైతు వేదికలో సోమవారం రైతులకు ప్రపంచ మృత్తిక (నేల) దినోత్సవ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ నేల యొక్క విశిష్టత గురించి చర్చించడం జరిగింది .ముఖ్యంగా నేలలు జీవ వైవిధ్యానికి నిలయాలు, మానవాళి ప్రగతికి చాలా విలువైనవి అని కాబట్టి ఈ సహజ వనరుని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు. ప్రతి రైతు సేంద్రియ మరియు జీవన ఎరువుల వాడకం వలన భూమి భౌతిక, రసాయన స్వభావాలు మెరుగుపడతాయి గనుక అధిక రసాయన ఎరువులు వాడద్దని తెలియజేశారు.
ప్రతి రైతు తొలకరి వానలకు పచ్చిరొట్ట పైర్లను ప్రధాన పొలంలో విత్తుకొని, పూత సమయంలో నేలలో కలియదున్ని , దమ్ము చేసి నాట్లు వేసుకున్నట్లైతే నేలలోని సేంద్రియ పదార్థం పెరిగి నేల ఆరోగ్యం మెరుగుపడటమే కాక రసాయనిక ఎరువులపై ఖర్చు 25 శాతం వరకు తగ్గించుకోవచ్చు అలాగే ప్రతి రైతు పంట మార్పిడి విధానం చేపట్టాలి, ధాన్యపు పంట తర్వాత అపరాల పంట వేయడం వల్ల నేల సారవంతంగా మారి చీడపీడల సమస్యలు తగ్గి రసాయనాల వాడకం తగ్గుతుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ యాసంగి పంట కాలంలో చేపడుతున్న క్షేత్ర స్థాయి ప్రదర్శనలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు.
మట్టి నమూనా ఎలా సేకరించాలో మరియు చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు వివరించడం అయినది. కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జూకంటి మోహన్ రెడ్డి, గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శ్రీరాం సురేష్, మండల కో ఆప్షన్ మెంబర్ అహ్మద్ అలి, తెరాస నాయకులు దుబ్బనీ శ్రీకాంత్, పెద్దయిపల్లి గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కామిశెట్టి భాస్కర్, మండల రైతు సమన్వయ సభ్యులు కామిశెట్టి శ్రీనివాస్, పి. ఏ. సి. ఎస్ డైరెక్టర్ బచ్చంగారి బసవయ్య, గ్రామ రైతులు కట్లేకుంట్ల సిద్దిరాములు, బత్తుల ఈశ్వర్, కట్లేకుంట్ల నవీన్ , శంకర్, సత్తయ్య, బలరాం, పరమేశం, మరియు రాజంపేట్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీకాంత్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Dec,2022 05:33PM