- ఇన్చార్జి ఎంపీడీవో గా ఎంపీఓ వెంకట నరసయ్య
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల ఎంపీడీవో గా విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన శ్రీనివాస్ ఎంపీడీవోకు మద్దూరు మండలం గ్రామ కార్యదర్శులు ఎంపీడీవో కార్యాలయ అధికారులు ఎంపీ ఓ కార్యాలయ సిబ్బంది ఉపాధి హామీ ప్రోగ్రాం అధికారి టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు సర్పంచులు ఎంపీటీసీలు ఆయనకు వీడ్కోలు సభ ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శులు ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ మద్నూర్ మండలానికి మీలాంటి ఎంపీడీవో అధికారి దొరకరని ఎవరికీ ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా విధి నిర్వహణలో ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ కలుపుకొని పోయే తత్వమని వారు కొనియాడారు మంచి వ్యక్తిగా మండలానికి ఇటు ప్రజాప్రతినిధులకు. అటు అధికారులకు విధుల నిర్వహణలో తెలియని వారికి తెలియజేస్తూ ఎవరికీ కోప పడకుండా పని విధానాన్ని నేర్పుతూ మండల అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన ఎంపీడీవో శ్రీనివాస్ కు ప్రతి ఒక్కరూ శాలువలతో సత్కరించి, మీలాంటివారు ఎక్కడ దొరకరని కృతజ్ఞతలు తెలిపారు. బదిలీపై వెళ్లిన శ్రీనివాస్ స్థానంలో ఇన్చార్జి ఎంపీడీవోగా మద్నూర్ మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్యకు బాధ్యతలు అప్పగించారు. బదిలీపై వెళ్తున్న శ్రీనివాస్ దంపతులకు ప్రతి ఒక్కరి సన్మానించి ఆయన పని తీరుపై గొప్పగా కొనియాడారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎంపీడీవో శ్రీనివాస్ సొంత జిల్లా నిజామాబాద్ జిల్లాకు వెళ్లారు. ఈ సన్మాన కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Dec,2022 06:10PM