- రైతు సదస్సులో వ్యవసాయ విస్తీర్ణ అధికారి సమరిన్ అంజుమ్
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలంలోని కుర్ల వ్యవసాయ క్లస్టర్ పరిధిలోని మల్లాపూర్ గ్రామంలో గల రైతు వేదిక భవనంలో సోమవారం నాడు ప్రపంచ మృత్తిక దినోత్సవం పురస్కరించుకొని రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా క్లస్టర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారి సమరిన్ అంజుమ్ రైతులకు అవగాహన కల్పిస్తూ వ్యవసాయానికి రసాయన ఎరువులు తగ్గించాలని సేంద్రియ ఎరువులు వాడకం మంచిదని సూచించారు రైతులు సాగు కోసం విత్తన శుద్ధి చేసిన విత్తనాలనే వాడాలని కోరారు. ఈ అవగాహన సదస్సులో ఆ గ్రామ సర్పంచ్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు వీరేష్ గుండా టిఆర్ఎస్ పార్టీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు సంజయ్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బాబు మియా ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm