- ఆర్టిసి చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
నవతెలంగాణ-డిచ్చిపల్లి
నేల కలుషితం కాకుండా భవిష్యత్తు తరాలకు సుస్థిరమైన, స్థిరమైన సజీవ వనరుగా అందించడం మన అందరి బాధ్యత అని, నేల కలుషితం కాకుండా సహజ సూక్ష్మజీవుల పరిరక్షణ కోసం, నేల జీవ శక్తిని కొనసాగించే ఉద్దేశంతోనూ ప్రపంచ నేలల దినోత్సవం జరుపుకుంటున్నామని ఆర్టిసి చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సోమవారం డిచ్ పల్లి మండలంలోని ధర్మారం బి లోని బర్దిపూర్ రైతు వేదికలో ప్రపంచ మృత్తిక నేల దినోత్సవం సందర్భంగా వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుత ప్రపంచ మృత్తిక నేల దినోత్సవం సందర్భంగా నేల కలుషితం కాకుండా భవిష్యత్తు తరాలకు సుస్థిరమైన, స్థిరమైన సజీవ వనరుగా అందించడం మన అందరి బాధ్యత అని నేల కలుషితం కాకుండా సహజ సూక్ష్మజీవుల పరిరక్షణ కోసం, నేల జీవ శక్తిని కొనసాగించే ఉద్దేశంతోనూ ప్రపంచ నేలల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు.
ఇలాంటీ కార్యక్రమం వల్ల రైతులకు అవగాహన కల్పిస్తే అర్థమవుతుందన్నరు.విపరీతమైన ఎరువులు, పురుగు మందులు, ఇతర రసాయన ఉత్పాదకాల వాడకంతో నేల స్వభావమే మారిపోతుందని, రైతులు ఆర్గానిక్ సేంద్రియ ఎరువు పద్ధతిని అవలంబించి ప్రజల ఆరోగ్యాలని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, రైతులందరూ సేంద్రీయ వ్యవసాయాన్ని చెయ్యాలని సూచించారు. నేలపై మంచి మార్పు అయినా, చెడ్డ మార్పు అయినా చాలా నెమ్మదిగా వస్తుందన్నారు. భవిష్యత్తు తరాలకు మంచి నేలను అందించాల్సిన బాధ్యత మనమీదే ఉందన్నారు.రైతులందరూ వరి పంటనే కాకుండా, చిరుధాన్యాలు, కూరగాయలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద రైతులకు ఆయిల్ ఫామ్ అందిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ ఆయిల్ ఫామ్ సాగు చేయడం వల్ల వరి కంటే అధిక దిగుబడులు వచ్చి రైతులు ఆర్థికంగా ఎదగవచ్చని, ఆయిల్ ఫామ్ పంట గురించి, నీకేమైనా సందేహాలు, సూచనలు కావాలంటే వ్యవసాయ శాఖ అధికారులకు సంప్రదించాలని రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జడ్పిటిసి దాసరి ఇందిరా లక్ష్మీ నర్సయ్య, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు చింతం శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ పత్తి మమతా అనంద్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జీనియస్ నారాయణ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మోహన్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు శక్కరి కోండ కృష్ణ, ఓడం నర్సయ్య, ప్రధాన కార్యదర్శి హరికిషన్, సొసైటీ చైర్మన్లు గజవాడ జైపాల్, నాగేశ్వరరావు, డైరెక్టర్లు, సర్పంచులు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, వ్యవసాయ శాఖ అధికారి రాంబాబు, విస్తరణ అధికారులు రైతులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Dec,2022 06:20PM