నవతెలంగాణ-భిక్కనూర్
18 సంవత్సరాలు నిండిన యువతి యువకులకు ఓటు హక్కు నమోదు చేసుకునేలా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆర్డిఓ శ్రీనివాస్ సూచించారు. సోమవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఓటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, అలాగే ఓటర్ నమోదులో ఏవైనా తప్పులు దొర్లితే సరిదిద్దుకొనేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ సాయిబాబా, ఎమ్మార్వో నర్సింలు, ఎంపీడీవో అనంతరావు, ఎంపీఓ ప్రవీణ్ కుమార్, పట్టణ సర్పంచ్ తునికి వేణు, ఉప సర్పంచ్ గోడ నరేష్, పంచాయతీ కార్యదర్శి సదాశివ్, గ్రామ వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm