నవతెలంగాణ-భిక్కనూర్
ప్రభుత్వ నిబంధన ప్రకారం గ్రామపంచాయతీ సంబంధించిన నూతన భవనాల అద్దె చెల్లించాలని ఆర్డీవో శ్రీనివాస్ సూచించారు. సోమవారం భిక్నూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామపంచాయతీ పాలకవర్గం, టెండర్లలో దక్కించుకున్న సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ నిబంధనల ప్రకారం టెండర్ లో పూర్తి డబ్బులు చెల్లించిన వారికి ఏఈపిఆర్ సోహెల్ సమక్షంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు అద్దె ధరను నిర్ణయించాలని. టెండర్లలలో పూర్తి డబ్బులు చెల్లించని వారికి టెండర్ వేసిన నాటి నుండి నేటి వరకు 12% శాతం వడ్డీతో మొత్తం డబ్బులు వసూలు చేయాలన్నారు.
పూర్తి నివేదికను త్వరగా పాలకవర్గం తయారుచేసి కలెక్టర్ కి సమర్పించిన అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్ణయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అనంతరావు, ఎంపీ ఓ ప్రవీణ్ కుమార్, సర్పంచ్ తునికి వేణు, ఉప సర్పంచ్ నరేష్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Dec,2022 06:24PM