నవతెలంగాణ-డిచ్ పల్లి
యూనియన్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి అయినా సందర్బంగా నేడు అర్ముర్ ఎంకే సంగం లో మహా సభను బీడీ కార్మికులు బీడీ ప్యాకర్స్ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర నిర్మాణ కార్యదర్శి జెపి గంగాధర్ అన్నారు. డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘనపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూనియన్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి అయినా సందర్బంగా 6 న అర్ముర్ లోని ఎంకే సంగం లో మహా సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
బీడీ కార్మికులు బీడీ ప్యాకర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నాలన్నారు. కార్మికులను విభజించి ఐక్యతను యాజమాన్యం దెబ్బతిస్తున్నాయని, బీడీ కార్మికుల శ్రమ దోపిడీ చేయడం, కార్మికుల డిమాండ్ సాధనను బలహీన పరుస్తు అనేక యూనియన్లు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయన్నరు. కార్మిక సంగం అంటే కార్మికుల డిమాండ్ హక్కులు సాధించ్చేటట్లు ఉండాలని, కార్మికుల వేతన బాకీ లు సాదించాలి అన్నారు.ఈ కార్యక్రమం లో భారతి, రాష్ట్ర నాయకురాలు శైలజ, సుమ, సావిత్రి, సునీత తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Dec,2022 06:26PM