నవతెలంగాణ-డిచ్ పల్లి
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు మంగళ వాయి ఇందల్ వాయి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ అంతర్జాతీయ దినోత్సవం పురస్కరించుకొని
ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ జిల్లా విహెచ్పిఎస్ అధ్యక్షులు బీరప్ప,రూరల్ కన్వీనర్ కుంట మహిపాల్ రెడ్డి లు పాల్గొని మాట్లాడుతూ దివ్యాంగుల చట్టాలు, వికలాంగులకు ఉన్నటువంటి పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దివ్యంగుల హక్కులను కాపాడాలని వారన్నారు. అనంతరం ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు, పాల్గొన్న వారికి బహుమతులు అంద చేశారు. ఈ కార్యక్రమంలో మండలం చైతన్య వికలాంగుల సంఘం అధ్యక్షులు ఏర్గు శ్రీనివాస్, మహిళ విభాగం అధ్యక్షురాలు అబ్బవ్వ, కుంట జమున, కుమ్మరి జమున, అంకం గంగాధర్ లతో పాటు ఆయా గ్రామాలకు చెందిన దివ్యంగులు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ఆర్థికంగా, వస్తువు రూపంలో సహాయపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Dec,2022 06:28PM