- సూర్య షోటో ఖాన్ కరాటే అకాడమీ ఫౌండర్ సురేష్
- మేడారంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ పోటీలు
నవతెలంగాణ -తాడ్వాయి
శరీర దారుఢ్యం పెంపొందించుకోవడంతో పాటు ఆత్మరక్షణకు ప్రతి ఒక్కరూ కరాటే శిక్షణ పొందాలని షోటో ఖాన్ కరాటే అకాడమీ ఫౌండర్, టెక్నికల్ డైరెక్టర్ పాయం సురేష్, మేడారం ఇంగ్లీష్ మీడియం ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సరోజనలు అన్నారు. సోమవారం మండలంలోని మేడారం ఇంగ్లీష్ మీడియం ఆశ్రమ పాఠశాలలో హెచ్ఎం తల్లడి సరోజన, అధ్యక్షతన 30 మంది విద్యార్థినిలకు కరాటే బెల్టులు ట్రైనింగ్ కోచ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో ప్రధానం చేశారు.
| ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు చిన్ననాటి నుంచే కరాటే శిక్షణ తీసుకోవాలన్నారు. ముఖ్యంగా మహిళలు కరాటేపై ఆసక్తి చూపించాలన్నారు. కరాటే ద్వారా ఆత్మ రక్షణతో పాటు, ఆరోగ్యంగా ఉండగలుగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడారం ఇంగ్లీష్ మీడియం పాఠశాల డిడబ్ల్యూ సృజన, గుంట సమ్మయ్య, మాస్టర్ చందా హనుమంతరావు, లక్ష్మణమూర్తి, విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Dec,2022 06:30PM