నవతెలంగాణ-డిచ్ పల్లి
ధ్యానం-యోగా-మేడిటిషన్ చదువు లో ఏకాగ్రత సాధన పై మెళుకువలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిచ్ పల్లి మండలంలోని ధర్మారం బిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాటశాల, కళాశాల లో ఆదివారం, సోమవారం రెండు స్టిల్స్ మలే రోజులు ప్రధాన సంస్థ పక్షాన ఉ ఎస్సీఐసి- ఎంఏసిఏపై అనే సాంప్రదాయ సంస్కృతి-సంగీత ప్రచార సంస్థ నిర్వాహకులు 73 ఏళ్ళ వయస్సు గల పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్.కిరణ్ సేథ్ ద్వారా సాయంత్రం ధ్యానం - యోగా - మేడిటిషన్ చదువులో ఏకాగ్రత సాధన మెళుకువలను విద్యార్థులకు బోధించారు.
సోమవారం ఉదయం ప్రముఖ భారతీయ కథక్ నృత్యకారిణి - నాట్యకారిణి మనీషా గుళ్యాణి అధ్బుత నాట్య ప్రదర్శన, నాట్యం లోని ముద్రాల శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కళాశాల పాఠశాల ప్రిన్సిపల్ బి. సంగీత తెలిపారు.డా.కిరణ్ సిధ్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేస్తూ, యువ చైతన్యమే లక్ష్యంగా భారతీయ వారసత్వ పరిరక్షణకు శ్రీకారం చుట్టి భారత మూలలతో పాటు సాంప్రదాయ సంగీత సంస్కృతిక జనపద కళలు నృత్య చలన చిత్ర - ధ్యానం యోగా మొదలైన విభాగాలలో ప్రముఖుల ప్రసంఘాలతో చర్చలతో అవగాహన ప్రదర్శనలతో ప్రోత్సాహాన్ని కలిగిస్తున్నారని అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని ధర్మారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు ఆదివారం సాయంత్రం చేరుకుని విధ్యార్ధులకు ధ్యానం (యోగా - మేడిటేషన్ చదువు లో ఏకాగ్రత సాధన మెళుకువలను బోధించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ డి.కిషన్, సిబ్బంది, విద్యార్థినిలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Dec,2022 06:40PM