నవతెలంగాణ-తాడ్వాయి
మండలంలోని కాటాపూర్ రామాలయంలో మహాపడి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం నాడు భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు రంగ రంగ వైభవంగా కనుల పండగ ఘనంగా నిర్వహించారు. వేకువ మజానే ఆలయ పూజారి స్వామివారికి అభిషేకం, అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రామాలయం నుండి కాటాపూర్ వీధుల గుండా సాగిన సంకీర్తన లో సంప్రదాయ వస్త్రాలు ధరించి గ్రామ ప్రముఖులు స్వయంగా పాల్గొన్నారు. సాంస్కృతిక కళాకారులు, వాయిద్య చప్పుళ్ళు, మహిళా కోలాటాలు, అయ్యప్ప స్వామి భక్తుల సంకీర్తనలతో గ్రామంలోని వీధులు మారుమ్రోగాయి. సుమారుగా 5 గంటల పాటు సాగిన సంకీర్తనలో గ్రామ ప్రముఖులు సర్పంచ్, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా, మాలా దారులను, భక్తులను ఉత్సాహ పరిచారు.
కాటాపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన స్వాములు పాల్గొన్నారు. టయానికి విచ్చేసిన భక్తులు భాజా భజంత్రీలు, భజన సంకీర్తనల మధ్య అయ్యప్ప ఓం, శ్రీ స్వామియే శరణమయ్యప్ప అనే నామస్మరణంతో స్వామిని స్మరిస్తూ, వారి వారి కోరికలను కోరుకున్నారు. అలాగే గ్రామంలోని భక్తులు పశుసంపదలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తులు, మండల ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Dec,2022 07:21PM