నవతెలంగాణ-డిచ్ పల్లి
నేటి నుండి ఇంటింట కుష్టు సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని మండల విస్తరణ అధికారి వై శంకర్ అన్నారు.సోమవారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని మంగళవారం పకడ్బందీగా చేయాలని మండల ఆరోగ్య విస్తరణ అధికారులు వై.శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమ 14 వ రోజు వరకు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి గృహ సందర్శన ఆశా కార్యకర్త చేయాలని సూచించారు. శరీరంపై స్పర్శ లేని చెమటరాని, వెంట్రుకలు మొలవని, గోధుమ రంగు మచ్చలు ఉన్నట్లయితే వారిని గుర్తించి అధికారులకు తెలుపాలని వివరించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నర్స్ ఎలిజబెత్ ఆరోగ్య పర్యవేక్షకులు అక్బర్ అలీ, ఉమారాణి ఆస్పత్రి పరిదిలోని అన్ని గ్రామాలకు చెందిన ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Dec,2022 07:24PM