- ఎం.పి.పి శ్రీరామమూర్తి
నవతెలంగాణ-అశ్వారావుపేట
నేల సారవంతంగా ఉంటేనే భావితరాలకు భవితవ్యం ఉంటుందని ఎం.పి.పి జల్లిపల్లి శ్రీరామమూర్తి అన్నారు.
ప్రపంచ మృత్తికా దినోత్సవం పురస్కరించుకుని సోమవారం స్థానిక వ్యవసాయ కళాశాల, వ్యవసాయ శాఖ సంయుక్తంగా రైతు వేదికలో నేల ఆరోగ్యం, దాని ప్రాముఖ్యత పై రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా హాజరైన ఆయన మాట్లాడుతూ 300 శాతం నేల సారవంతం కోల్పోయిందని, రానున్న 30 సంవత్సరాలలో ఆహార కొరత అధికం కావొచ్చని,దీనికి రైతు సోదరులు విచక్షణారహితంగా రసాయన ఎరువులు, పురుగు మందల వాడకం తగ్గించాలని తెలిపారు.
వ్యవసాయ శాస్త్రవేత్త ఐ.వి.శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రైతు సోదరులు సేంద్రీయ వ్యవసాయం దిశగా ఆలోచించాలని కోరారు. కృత్రిమంగా తయారు చేసే వానపాముల ఎరువు, జీవన ఎరువులను రైతులు ఉపయోగించి కోవాలి అని సూచించారు. పచ్చిరొట్టె పైర్ల ఆవశ్యకతను తెలియజేశారు. డాక్టర్ రాంప్రసాద్ భూసార పరీక్ష ప్రాముఖ్యత గురించి వివరించారు. 25 మంది రైతులు తాము తెచ్చిన మట్టి నమూనాలను తక్షణ భూసార పరీక్ష చేసి పట్టికలను అందజేశారు. డాక్టర్ రెడ్డిప్రియ జీవన ఎరువుల ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల ఇంచార్జి ఎడి వెంకన్న, పిఎసిఎస్ అశ్వారావుపేట చైర్మన్ చిన్నం శెట్టి సత్యనారాయణ, వ్యవసాయ అధికారి శ్రీ నవీన్, వ్యవసాయ విస్తరణ అధికారి రాయుడు, కళాశాల శాస్త్రవేత్తలు ఎస్. మధుసూదన్ రెడ్డి, కె.శిరీష్,ఆర్. శివకుమార్, దీపక్ రెడ్డి,కళాశాల నాలగవ మరియు మూడవ సంవత్సర విద్యార్థిని విద్యార్థులు, అశ్వారావుపేట రైతు సోదర సోదరీ మనులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Dec,2022 07:32PM