నవతెలంగాణ-అశ్వారావుపేట
ఆహారానికి నేలే ఆధారం అని, భూసారం పైనే పంటలు దిగుబడులు ఉంటాయని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం స్థానిక ఉద్యాన పరిశోధనా కేంద్రం అధిపతి, ఉద్యాన శాస్త్రవేత్త గోళ్ళ విజయ్ క్రిష్ణ అన్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ 5 ను ప్రపంచ మృత్తికా దినోత్సవంగా జరుపు కుంటామని, ఈ సంవత్సరం కూడా నేలే ఆహారానికి ఆధారం అనే నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రపంచ మృత్తికా దినోత్సవ సంధర్భంగా (డిసెంబర్ - 5) ఉద్యాన పరిశోధన స్థానంలో మృత్తికా దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవశ్యకత గురించి అవగాహన కల్పించారు.మితి మీరిన రసాయన ఎరువులు వాడకం తగ్గించడం, సేంద్రియ ఎరువులు,జీవన ఎరువులు వాడకం,పచ్చిరొట్ట ఎరువులు వాడకం మరియు పంట మార్పిడి చేయడం వంటి చర్యలు చేపట్టాలని తెలిపారు. తద్వారా ఏవిధంగా మృత్తికా ఆరోగ్యం ను కాపాడకోవచ్చునో తెలిపారు. ఈ కార్యక్రమంలో కట్టా సుబ్బారావు, నరేందర్ ప్రసాద్, ఇతర ఉద్యాన పరిశోధన స్థానం సిబ్బంది పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Dec,2022 07:34PM