- నార్లాపూర్ లో ఘనంగా ప్రపంచ మృతిక దినోత్సవం
నవతెలంగాణ-తాడ్వాయి
రైతులు భూసారాన్ని కాపాడుకోవాలని జడ్పీ వైస్ చైర్మన్ నాగజ్యోతి, ఎంపీపీ గొంది వాణిశ్రీ, సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్ శ్రీధర్ లు అన్నారు. సోమవారం మండలంలోని నార్లాపూర్ రైతువేదిక భవనంలో ప్రపంచ మృతిక దినోత్సవంను స్థానిక మండల వ్యవసాయ శాఖ అధికారి పోరిక జై సింగ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయం మనుగడకు భూమి ప్రాముఖ్యతను వివరించారు.
నేలలో సారం కాపాడుకునేందుకు సేంద్రియఎరువు(పశువులు, వాన పాములఎరువు)లు అధిక మోతాదులో వేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. పచ్చిరొట్ట ఎరు వు(జీలుగ, జనుము)ను పెంచి కలియ దున్నడంతో భూమి ఎంతో సారవంతమవుతుందన్నారు. ప్రతి రైతు కూడా తమ తమ భూములలో భూసార పరీక్షలు చేయించుకోవాలని, భూసార పరీక్షలు ఆధారంగా రసాయనిక ఎరువులు వాడాలని సూచించారు. స్థానిక వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు జి జె రవికుమార్, నవ్య శ్రీ భవాని, మండల రైతు బంధు సమితి కమిటీ అధ్యక్షులు దిడ్డి మోహన్ రావు, రైతుబంధు గ్రామ కమిటీ కోఆర్డినేటర్ కొర్నెబెల్లి అశోక్, ఆత్మ కమిటీ మెంబర్ వీరేశం మేడారం ఉత్సవ్ కమిటీ మాజీ అధ్యక్షులు శివన్న, సర్పంచుల పోరం మండల అధ్యక్షురాలు గడ్డ అరుణ, ఎంపీటీసీ కుక్కల శ్రీను, విలేజ్ కోఆర్డినేటర్లు బాపిరెడ్డి, శ్రీను
రైతులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Dec,2022 07:37PM