నవతెలంగాణ-డిచ్ పల్లి
నల్లవెల్లి సహకార సొసైటీలో రైతుల వద్ద నుండి హమాలీలకు సంబంధించిన డబ్బులను 15 రూపాయలు చొప్పున ఒక సంచికి వసూలు చేస్తున్నారని, ఇతర సొసైటీలు ఇందల్ వాయి, రాంపూర్ డి, ఎల్లారెడ్డి పల్లి, అమ్సన్ పల్లి గ్రామాలలో రైతుల వద్ద నుంచి 13 రూపాయలు వసూల్ చేస్తున్నారని, దీనిపై విచారణ జరిపి చర్యలు చేపట్టాలని కోరుతూ ఇందల్ వాయి మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన సిహెచ్ సంతోష్ రెడ్డి సోమవారం జిల్లా సహకార శాఖ అధికారి సింహాచలంకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు కాపీని విలేకరులకు అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ఒక సంచికి రైతుల వద్ద నుండి 15 రూపాయలు తీసుకుంటున్నారని, హమలిలకు మాత్రం పది రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని దినిపై విచారణ జరిపి వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
నల్లవెల్లి సహకార సొసైటీ పరిధిలోని పలు గ్రామాల్లో నేలకోల్పిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు వద్ద నుండి 14 రూపాయలు తిసుకుంటున్నమని,లిపిలో సంచికి 1 రూపాయి లారి కు అందజేసి, మిగిలిన డబ్బులు హమలిలకు అందజేస్తున్న మని నల్లవెల్లి సహకార సొసైటీ సిఈఓ తేజగౌడ్ విలేకరులకు తెలిపారు. రైతుల వద్ద నుండి ఎలాంటి డబ్బులు ఎక్కువ తిసుకుంటున్నరే విషయం కరేక్టు కాదన్నారు.రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు మేలు చేసే విధంగా చుడటం జరుగుతుందని ఆయన తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Dec,2022 07:39PM