నవతెలంగాణ-తాడ్వాయి
ములుగు జిల్లా తడ్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎంసిడి శిక్షణ తరగతులను డిప్యూటీ డిఎం హెచ్ ఓ కోరం క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపియన్ 6వ తేదీ నుండి 22వ తేదీ వరకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆశా కార్యకర్తలు టీములుగా ఏర్పడి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కుష్టు వ్యాధి ఏవిధంగా సోకుతుంది, వ్యాధి లక్షణాలను వివరించారు. పొగాకు వాడకం వల్ల అనర్థాలను తెలిపి, క్యాన్సర్ వ్యాధులు కొని తెచ్చుకోవద్దని సూచించారు. పిల్లలచే పొగాకు ఉత్పత్తులను అమ్మడం, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే జరిమాన విధించాల్సిందే అన్నారు. కుష్టు వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ వ్యాధి చర్మం శ్లేష్మ పొరలు, పెరిఫెరల్ నరములు, కళ్ళు, శ్వాస వ్యవస్థను ప్రభావితం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎమ్ఓ సంజీవరావు, వైద్యులు నవ్యశ్రీ, ఎంఓ డాక్టర్ స్వాతి, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Dec,2022 07:42PM