- నిజామాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రజలు గమనించాలి
నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అలీ సాగర్ ఫిల్టర్ బెడ్ లో ఏర్పడిన లీకేజీ కారణంగా నేడు అనగా మంగళవారం పలు క్రింది ప్రాంతాల్లో ఉదయం త్రాగు నీటి సరఫరా వుండదు అని నిజామాబాద్ మున్సిపల్ అధికారులు సోమవారం ప్రకటనలో తెలియజేశారు. కావున నిజాంబాద్ నగరంలోని పలు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు సుభాష్ నగర్, గంగస్తాన్, హమాల్వాడి, దుబ్బ, గౌతం నగర్,కంటేశ్వర్,చంద్ర శేకర్ కాలనీ, ఎళ్ళమ్మగుట్ట, పోచమ్మ గల్లి, గోల్ హనుమాన్, అర్స పల్లి, మాలపల్లి, అహ్మద్ పుర కాలనీ, హబీబ్ నగర్ ప్రాంతాలవాసులు సహకరించగలరని కోరుతున్నామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm