నవతెలంగాణ-డిచ్ పల్లి
డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమవారం జాతీయ రహదారి 44 వద్ద సారంగ్ పెట్రోల్ పంపు ఎదురుగా హైదరాబాద్ వైపు వెళ్ళే రోడ్డుపైన ఒక గుర్తు తెలియని, మతిస్థిమంతం లేని బిక్షగాడిని ఎదో గుర్తుతెలియని వాహనం డికొనగా తల పగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై కచ్చకాయల గణేష్ తెలిపారు. మృతి చేయించిన విషయం టోల్ ఫ్లాజ రూట్ పెట్రోలింగ్ ఆఫీసర్ యార్పటి నిఖల్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని మార్చురీకి తరలించినట్లు ఎస్సై కచ్చకాయల గణేష్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm