నవతెలంగాణ-ఏర్గట్ల
ఏర్గట్ల మండలకేంద్రానికి చెందిన యువకుడు తాళ్ళరాంపూర్ లోని పలు ఇళ్ళల్లో దొంగతనాలకు పాల్పడడంతో తాళ్ళరాంపూర్ కు చెందిన వారు దొంగను పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. ఈ విషయమై ఏర్గట్ల ఎస్సై రాజు మాట్లాడుతూ దొంగతనం చేసిన యువకుడు బంగారాన్ని మెట్ పల్లి లో ఒక స్వర్ణకారుడి వద్ద తక్కువ ధరకు అమ్మాడని. వెంటనే ఆ స్వర్ణకారుడు దొంగ ఫోన్ పే నంబర్ కు 3 లక్షల రూపాయలు పంపాడని ఆ కోణంలో విచారణ నిమిత్తం మెట్ పల్లి నుండి బంగారం కొన్న స్వర్ణకారుడిని ఏర్గట్ల పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చామని ఎస్సై తెలిపారు. ఇదే విషయమై మెట్ పల్లి స్వర్ణకారులు మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుండి మా స్వర్ణకారుడిని విచారణ నిమిత్తం తీసుకువచ్చి వివిధ కోణాల్లో హింసకు గురిచేస్తూ ఏర్గట్ల ఎస్సై విచారణ చేస్తున్నారని మా స్వర్ణకారుడిని బేషరతుగా విడుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మెట్ పల్లి స్వర్ణకారులు ఏర్గట్ల బస్టాండ్ వద్ద ధర్నాకు దిగారు.
విషయం తెలుసుకున్న ఆర్మూర్ సిఐ గోవర్ధన్ రెడ్డి,కమ్మర్ పల్లి ఎస్సై రాజశేఖర్ అక్కడికి చేరుకొని వారిని సముదాయించే లోపే ధర్నా స్థలం వద్దకు తాళ్ళ రాంపూర్ బాధితులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని మాట్లాడుతూ మాది సుమారు 30 తులాల వరకు బంగారం పోగొట్టుకొని మేము బాధపడితే మెట్ పల్లి స్వర్ణకారులు దొంగ బంగారం తక్కువ పైసలకు కొని కోట్లకు పడగలెత్తు తుంటే...ఏర్గట్ల ఎస్సైని విచారణ చేయనియకుండా, మాకు న్యాయం జరగకుండా ఏర్గట్లలో మెట్ పల్లి స్వర్ణకారులు ధర్నాకు కూర్చోవడం ఏంటని ప్రశ్నించారు. మాకు న్యాయం జరగకపోతే మేము కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, మా వద్ద దొంగతనం చేసిన దొంగను, దొంగ బంగారం కొన్న మెట్ పల్లి స్వర్ణకారుడిని శిక్షించి మా బంగారం మాకు ఇప్పించి మాకు న్యాయం చేయాలని తాళ్ళరాంపూర్ బాధితులు కోరారు. ఇదే విషయమై మెట్ పల్లి స్వర్ణకారులకు, తాళ్ళరాంపూర్ బాధితులకు వాగ్వివాదం జరుగగా అక్కడున్న పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో అక్కడ గొడవ సద్దుమణిగింది.
ఆర్మూర్ సిఐ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దొంగ బంగారం కొన్న వ్యక్తిని విచారిస్తున్నామని, ఈ విచారణ కొనసాగుతుందని, మెట్ పల్లి స్వర్ణకారుడు దొంగ బంగారం కొన్నాడని విచారణలో తేలితే అతనిపై తగు చర్యలు తీసుకుంటామని, అలాగే ఎస్సై రాజు స్వర్ణకారుడిని అకారణంగా కొట్టాడని, మెట్ పల్లి స్వర్ణకారులు ఆరోపిస్తున్నారని దానిని కూడా విచారించి తగు చర్యలు తీసుకుంటామని, విచారణ అయిపోయే వరకు తాళ్ళరాంపూర్ బాధితులు, మెట్ పల్లి స్వర్ణకారులు సంయమనం పాటించాలని సిఐ కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 06 Dec,2022 02:16PM