నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాదు పట్టణంలో అంబెడ్కర్ చౌరస్తా వద్ద గల భారత రాజ్యాంగ నిర్మాతగా భారత దేశ ఔన్నాత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన న్యాయకోవిదుడు, ఆర్ధిక వేత్త, మహోన్నత కీర్తి శిఖరం భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ 66వ వర్ధంతి సందర్బంగా, ఆ మహనీయునికి మాదిగ ఉద్యోగుల విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం నిజామాబాద్ ఆధ్వర్యంలో రెండు నిమిషాలు మౌనం పాటించి పూలమాలతో ఘనంగా నివాళులు మంగళవారం అర్పించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు జి. గంగారం మాట్లాడుతూ అంబేద్కర్ చరిత్రను అందరూ తెలుసుకోవడానికి ఆయన జీవిత చరిత్ర పుస్తకాలు చదవాలని, అందుకు తన వంతుగా అంబేద్కర్ పుస్తకాలు సంఘ సభ్యులకు అందజేస్తానని, అంబేద్కర్ ఇచ్చినటువంటి అమూల్యమైన ఓటు హక్కును భారత దేశ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని మంచి నాయకులను ఎన్నుకొని అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల డ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు జి మహేష్, గౌరవ సలహాదారులు, సిద్ధిరాములు , వినోద్ కుమార్, సత్యనారాయణ, రాజ్ గగన్ , జిల్లా అధ్యక్షులు గుడ్ల రాములు, ప్రధాన కార్యదర్శి కేశపురం రమేష్, అసోసియేట్ ప్రెసిడెంట్ బాబా శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వి. సాయిలు, జె.గంగయ్య, కోశాధికారి కే. గంగాధర్, వినోద్ పాల్గొన్నారు.
మంగళవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ భారతదేశంలోని అణగారిన వర్గాల ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించటానికి అందరికీ సమానత్వం సామాజిక న్యాయం జరగటానికి భారత రాజ్యాంగాన్ని ఈ దేశ పౌరులకు అందించినారని, కానీ నేటి భారత పాలకవర్గం నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం భారత రాజ్యాంగానికి తోట్లు పొడిచి మన ధర్మ శాస్త్రం అమలు జరపటానికి సామాజిక అణిచివేత వివక్షత కొనసాగటానికి తమ విధానాలను అనుసరిస్తున్నారని ఈ మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా పోరాడి భారత రాజ్యాంగాన్ని అమలు జరపటానికి ఉద్యమాలు నిర్వహించడమే అంబేద్కర్ కు నిజమైన నివాళి అర్పించడం అవుతుందని ఆయన తెలిపారు.
సీపీఎం పార్టీ నిరంతరం సామాజిక న్యాయం సమానత్వం కొరకు అనేక ఉద్యమాల్ని నిర్వహించటం జరుగుతుందని ప్రజల హక్కుల కోసం జరిగే ఉద్యమాలను నేటి పాలకులు అంచి వేయటానికి పూనుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నగర కార్యదర్శి పెద్ది సూరి, నగర కార్యదర్శి వర్గ సభ్యులు సుజాత, రాములు, మరియు, గణేష్, రాము తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 06 Dec,2022 02:23PM