నవతెలంగాణ-కంటేశ్వర్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా పూలంగులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిజామాబాద్ ఎమ్మార్పీఎస్ టీఎస్ కమిటీ నివాళులు మంగళవారం అర్పించడం జరిగింది. అనంతరం కోర్ కమిటీ సభ్యులు నాంపల్లి మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను గుర్తించి పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలని కోరారు. నివాళులు అర్పించిన వారిలో కార్పొరేటర్ రాము, ఇన్చార్జ్ సల్లూరి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు గుండారం మోహన్, సహాయ కార్యదర్శి సాయి బాబా, తెడ్డు గంగారం, బాబా, శ్రీనివాస్, సాయిలు, గంగాధర్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm