- సిపిఎం మండల కార్యదర్శి నాయక్ వాడి శ్రీనివాస్
నవతెలంగాణ-నవీపేట్
భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆచరించి ఆయనకు నిజమైన నివాళిని అర్పించాలని సిపిఎం మండల కార్యదర్శి నాయక్ వాడి శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని సుందరయ్య కాలనీలో అంబేద్కర్ 66 వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల పట్ల వివక్షపై సిపిఎం పార్టీ సుదీర్ఘ కాలం పోరాడిందని గుర్తు చేశారు.
స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగం నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర కీలకమైందని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కుతో వజ్రాయుధాన్ని ఇచ్చారని అన్నారు. ఆ ఓటు హక్కుతోనే ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు షేక్ మహబూబ్, అప్సర్, సావిత్రి సుశీల, అంకిత తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 06 Dec,2022 02:28PM