- మండల వ్యాప్తంగా అంబేడ్కర్ వర్థంతి దినోత్సవం
నవతెలంగాణ-బెజ్జంకి
ప్రపంచ దేశాలకు దిక్సూచిగా డాక్టర్ బాబా సాహేబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం పేరు ప్రఖ్యాతులు గడించిందని..అయన ఆశయాలతో పాటు కర్తవ్యాలను నెరవేర్చేలా ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని మండలంలోని ప్రజాప్రతినిధులు కొనియాడారు. మంగళవారం మండల వ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్థంతి దినోత్సవాన్ని గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు,అంబేడ్కర్ యువజన సంఘాలు,బీఎస్పీ అద్వర్యంలో నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు కల్లేపల్లి, బేగంపేట, వడ్లూర్, లక్ష్మీపూర్,గుగ్గీల్ల, రేగులపల్లి, గుండారం గ్రామాల్లోని అంబేడ్కర్ విగ్రహాలకు,ప్రభుత్వ కార్యలయాల్లో చిత్రపటానికి ప్రజాప్రతినిధులు, అధికారులు ,ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాలర్పించారు.
Mon Jan 19, 2015 06:51 pm