నవతెలంగాణ-కంటేశ్వర్
డిసెంబర్ 6 డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొర్గామ్ (పి) లో వ్యాసరచన పోటీలు మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎఫ్డిఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర, రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత మరియు మన కర్తవ్యం అనే అంశం మీద వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఆనాడు అనేక సమస్యలను అధిగమించి సుమారు 18 డిగ్రీలు చదివిన మహాజ్ఞాని, ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బీ ఆర్ అంబెడ్కర్ ని ఈ రోజు కేవలం ఒక్క వర్గానికి చెందిన వ్యక్తిగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు , కానీ అంబెడ్కర్ అందరివాడు అని గుర్తెరగడం లేదు.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ల కోసమే కాకుండా అగ్రవర్ణాల, అగ్రకులల వారి కోసం అందరికి ఉపయోగపడేలా రాజ్యాంగములో అనేక హక్కులను పొందు పొందుపరచడం జరిగింది. అంతే కాకుండా ఆనాడు కెవలము పురుషులకు మాత్రమే ఓటుహక్కు ఉండాలి స్త్రీలకు ఓటు హక్కు అవసరం లేదు అన్నవారితో విబేధించి పురుషులతో స్త్రీలు సమానమే అని నినదించి స్త్రీలకు సమానత్వం కల్పిస్తూ స్త్రీలకు కూడా ఓటుహక్కు కలిపించిన స్త్రీ అభ్యుదయవాదీ అంబెడ్కర్ అని, పేర్కొన్నారు. అలాంటి మహనీయుని చరిత్రను నేటి సమాజం తెలుసుకొవలని విద్యార్థులలో దాగివున్న ప్రతిభను గుర్తించడం కోసం ఈ వ్యాసరచన పోటీలు పెట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్డిఎస్ జిల్లా కన్వీనర్ ఎండి మోసిన్ చాణిక్య, విన్నూ విధార్ధిని విద్యార్థులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 06 Dec,2022 02:40PM