- బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాలు సూర్యనారాయణ
నవతెలంగాణ-కంటేశ్వర్
అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ నగరంలోని పుల్లంగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ యువత ముందుకు నడవాలి అన్నారు.
రాష్ట్రంలో కెసిఆర్ దళితులను మోసం చేస్తున్నారని, దళిత బంధు పేరుమీద మోసం చేసి చరిత్రలో నిలిచిపోయారు. దళితులను అక్కున చేర్చుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ వారి కష్టసుఖాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎల్లప్పుడూ ముందుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు శివప్రసాద్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మీనారాయణ, బిజెపి అసెంబ్లీ కన్వీనర్ పంచారెడ్డి లింగం, మండల అధ్యక్షులు రోషన్లాల్బోరా, పుట్టా వీరేందర్, గడ్డం రాజు, కుమార్ ఇల్లందుల ప్రభాకర్, బిజెపి నాయకులు సందీప్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 06 Dec,2022 03:08PM