- బిఎల్ ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్
నవతెలంగాణ-కంటేశ్వర్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన ఆశయ సాధన కోసం ఉద్యమించాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ అన్నారు. ఈ మేరకు మంగళవారండాక్టర్ అంబేడ్కర్ 66వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని పొలాంగుల గల అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ఆశించిన కుల, మత ప్రాంతీయ అంతరాలు లేని సమ సమాజం ఇంకా ఏర్పడలేదని అన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో అణగారిన వర్గాల ప్రజలపై ముఖ్యంగా దళితులపై మహిళలపై ఆదివాసులపై నిత్యము ఆధిపత్య కులాల దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు నిత్య కృత్యమయని ఆయన ఆవేదన చెందారు.
ప్రజలందరినీ సమానత్వం వైపు సాగించాల్సిన రాజ్యాంగాన్ని కేంద్రంలో ఏర్పడిన బిజెపి ప్రభుత్వం క్రమంగా రాజ్యాంగ సామాజిక న్యాయ ఆదేశిక సూత్రాలను తుంగలో తొక్కి ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. దేశ సంపద అంతా కేవలం 10 శాతం ఉన్న ఆధిపత్య దోపిడి శక్తుల వద్ద కేంద్రీకృతమైందని,
90 శాతం ఉన్న ప్రజల వద్ద కేవలం 10 శాతం ఆస్తి ఉన్నదని ఆయన చెప్పారు. రాజ్యాంగ ఆదేశిక సూత్రాలను సక్రమంగా అమలు జరిపి ఉంటే ఈపాటికి దేశం ప్రపంచంలో కెల్లా అత్యంత సంపన్న దేశంగా మారేదని దండి వెంకట్ అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఎఫ్ జిల్లా కన్వీనర్ కె.మధు, జిల్లా నాయకులు గోపి నాథ్, బిఎల్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, బి.ఎల్ ఎస్.ఎఫ్ జిల్లా కన్వీనర్ శ్రీమాన్, నగర నాయకులు కపిల్, కులాల ఫెడరెషన్ జిల్లా కన్వీనర్ ర్యపని నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 06 Dec,2022 03:12PM