నవతెలంగాణ-మద్నూర్
మంగళవారం నాడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని ఎస్.టి.ఓ కార్యాలయంలో కార్యాలయ అధికారులు అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ టి ఓ ఎన్ శివరాజ్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గొప్ప మహానీయుడని కొనియాడారు. భారతదేశానికి రాజ్యాంగ నిర్మాతగా ఆయన అందించిన సేవలు మరువలేనివని గుర్తు చేశారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో కార్యాలయ అధికారులు కె పవన్ కుమార్ సీనియర్ అకౌంటెంట్ టి.రవీందర్, సీనియర్ అకౌంటెంట్ ఎం సాయికుమార్, జూనియర్ అకౌంటెంట్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm