నవతెలంగాణ-మద్నూర్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని పద్మశాలిల గల్లీలో గల శ్రీ భక్తా మార్కండేయ మందిర వారులలో ఈనెల 11 వ తేదీ ఆదివారం రోజున బాన్సువాడ లో పద్మశాలి కళ్యాణ మండపము భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మద్నూర్ మండలం పద్మశాలి కుల బంధువులకు బాన్సువాడ జంగం గంగాధర్, బాలకిషన్, నారాయణలకు ప్రతెక్య ఆహ్వాన పత్రికను అందచేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు ఉష్కల్ శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు రచ్చ కుశాల్ అందే సందీప్, కోశాధికారి ఉస్కాల్ వెంకటేశ్, జిల్లా ఉప అద్యక్షులు రమణ ,జిల్లా కార్యవర్గ సభ్యులు రచ్చ పెంటేశ్, ఉత్తుర్ సంతోష్, రందిన్వార్ దత్తు, రచ్చ అశోక్ తదితరులు వున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm