నవతెలంగాణ-మద్నూర్
భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పైన గల అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం నాడు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళిత బలహీన వర్గాల వికాసానికి నిరంతరం పాటుపడిన భారత రత్న బిఆర్ అంబేద్కర్ సమ సమాజ స్థాపకులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే కొనియాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గొప్ప మహానీయులని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm