- భారతరత్న బి.ఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-మద్నూర్
భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న గ్రహీత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు మంగళవారం నాడు మద్నూర్ మండలంలోని గ్రామ గ్రామాన గల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ఇతర ప్రజా ప్రతినిధులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు ధరస్ వార్ సురేష్ మాట్లాడుతూ భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గొప్ప మహనీయులని, అతడు రచించిన రాజ్యాంగం ప్రకారం సమ సమాజాన్ని స్థాపనకు ఎంతో కృషి జరుగుతుందని పేర్కొన్నారు.
మద్నూర్లో సర్పంచ్ సురేష్ మాదన్ ఇప్పరుగాలో ఆ గ్రామ సర్పంచ్ రాజు పటేల్, లింబూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ మధుకర్ పటేల్ మండలంలోని ప్రతి గ్రామంలో సర్పంచులు ఎంపీటీసీలు ఇతర నాయకులు కలిసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ ఘనంగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 06 Dec,2022 04:20PM