నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలం బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు రాములు యాదవ్, జుక్కల్ నియోజకవర్గం ఇంచార్జ్ మండల మాజీ ఎంపీపీ ప్రజ్ఞ కుమార్ పార్టీ ఇతర నాయకులు చాట్ల శంకర్ దత్తు మహారాజ్ సునీల్ తదితరుల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం సమ సమాజానికి న్యాయం చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm