- బ్రహ్మకుమారి శక్తి బెహన్
నవతెలంగాణ-కంటేశ్వర్
సమానత్వం అనగా వికలాంలు కూడా సకలాంగులతో సమానంగా సమానత్వంతో జీవించడం అని బ్రహ్మకుమారి శక్తి బెహన్ అన్నారు. స్థానిక మారుతినగరీతిని స్నేహ సొసైటీ ఫర్-రూరల్ రీకన్స్ట్రక్షన్ యొక్క దివ్యాంగుల పాఠశాలలో బ్రహ్మకుమారీస్ వారు దివ్యాంగుల సమానత్వం పరిరక్షణ సాధికారిత ప్రచారమును వికలాంగులు వయోవృద్దుల సంక్షేమశాఖ తెలంగాణ ప్రభుత్వం వారిలో సంయుక్తంగా కలిసి మంగళవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో త్రీడీ మోడల్ ఎగ్జిబిషన్ బ్రెయిలీ అనువాదింపబడిన పుస్తకాలు ఇతర భాషలలో కూడా పుస్తకాలు, ఎన్ని ప్రేరణాత్మక పుస్తకాలు ఇతర భాషలలో కూడా ఎన్నీ ప్రేరణాత్మకమైన కథలతో ఆశావాదులుగాను, స్ఫూర్తిదాయకమైన అనుభవాలలో అనేకరకాల ఆటలు, పాటలు, మెడిటేషన్ మొదలగు కార్యక్రములలో పిల్లల అంతరంగిక వికాసానికి తగిన విధంగా ప్రేరణదాయకమైన కార్యక్రములను నిర్వహించారు. దివ్యాంగులతో వివిధ సామర్థ్యాలు కలిగిన వ్యక్తులతో జాగృతిని కలిగిస్తూ అందరితో వీరు సమనమైన వారిగా గుర్తింపును కలిగించడానికి సరికొత్త మార్గాన్ని సమాజంలో ప్రవేశపెట్టారు.
ఈ కార్యక్రమంనికి బ్రహ్మకుమ్ము శక్తి బెహన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆత్మవిశ్వాసం ఉంటే మనిషి ఉంటే మనిషి చేయలేనిది ఏమీ లేదు అని మనిషి జీవితంలో ముందుకు పోవడానికి మనిషికి వైకల్యం అనేది అడ్డు కాదని దివ్యాంగులు కూడా దివ్యాంగుల్లో మనోబలం ప్రశాంతత అనేది ఉంటే జీవితం ముందుకు సాగగలం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా బాహ్య సౌందర్యం కన్నా అంతరంగిక వికాసంతో ఆత్మిక శక్తులతో జాగృతం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమములో స్నేహ సొసైటీ కార్యదర్శియస్. సిద్ధయ్య, బ్రహ్మ కుమంది సునిత బెహన్, శోభ బెహన్, అనురాధ బెహన్, నర్మదంచిన ప్రీతి బెహన్, బిందుబెహన్, శ్రీృషబెషన్ స్నేహ సొసైటి పన్సిపాల్ యస్, జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, బ్రహ్మకుమారి ఎస్ శ్రీనివాస్ మానసిక వికలాంగులు , అంద విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 06 Dec,2022 04:31PM