- ఎం.డి.ఎం జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి
నవతెలంగాణ-నవీపేట్
మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు గుడ్డు అందించలేమని ఎం.డి.ఎం జిల్లా ప్రధాన కార్యదర్శి తోపునూరు చక్రపాణి అన్నారు. మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయంలో మంగళవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం పట్ల రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరితో మధ్యాహ్న భోజన కార్మికులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యవసర ధరలతో పాటు గుడ్డు ధర 7 రూపాయలు ఉంటే కేవలం ఐదు రూపాయలు ఇస్తుందని స్లాబ్ రేటు పెంచకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఎలా అందించాలని ప్రశ్నించారు.
ప్రత్యేక తెలంగాణలో కేవలం ఒక్క వినతితో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ వందల వినతులు ఇచ్చిన స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి వెంటనే ఇతర రాష్ట్రాల వలె కనీస వేతనం ఇవ్వాలని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చామంతి లక్ష్మి, నాగలక్ష్మి, శోభ, స్వరూప, లావణ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 06 Dec,2022 04:34PM