నవతెలంగాణ-మద్నూర్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం నాడు బిజెపి పార్టీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు వెంకట్ కాలే ఆధ్వర్యంలో ఆ పార్టీ పలువురు నాయకులు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పిస్తూ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగ నిర్మాతగా గొప్ప మహనీయునిగా పేరు ప్రతిష్టలు పొందారని, ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారమే భారత దేశంలో సమ సమాజానికి కృషి జరుగుతుందని పేర్కొన్నారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో బిజెపి పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ కృష్ణ పటేల్ కిసాన్ మోర్చా జిల్లా ట్రెజరర్ కంచిన్ యాదవరావు, బిజెపి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి చాట్ల హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm