నవతెలంగాణ-గోవిందరావుపేట
షార్ట్ లైట్ విధానాన్ని రద్దు పరిచి అందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలనీ సిపిఐఎం పార్టీ తెలుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని పసరలో ఆదివాసీ గిరిజన సంఘం రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పసర లో పెద్ద ఎత్తున ర్యాలీ తీసి 163 జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి దబ్బకట్ల లక్ష్మయ్యలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోడు సాగుదారులకు హక్కులు కల్పిస్తామని, దరఖాస్తులు స్వీకరించి శాటిలైట్ ఆధారంగా సర్వే నిర్వహిస్తే గోవిందరావుపేట మండలంలో 2400 దరఖాస్తుల గాను 140 దరఖాస్తులకు అక్కుపత్రాలు వచ్చాయని తాడ్వాయి మండలంలో 6500 గాను 750 అక్కు పత్రాలు వచ్చాయని అటవీ హక్కుల చట్టాన్ని అధికారులందరూ ధిక్కరించారని పేర్కొన్నారు.
అటవీ హక్కుల చట్ట ప్రకారం గ్రామ సభదే తుది నిర్ణయం అని శాటిలైట్ అనే పదం లేదని అయినా ప్రభుత్వ కలెక్టర్ ప్రాజెక్ట్ అధికారి ఏ చర్య తీసుకోకుండా ఈ విధానాన్ని ఆమోదించాలని ఇది చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే అటవీ హక్కు చట్టం 2006 అమలు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో పోడు సాగుతారులకు అండగా ప్రజా సంఘాలు సిపిఎం పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో జరుగు పోరాటాలకు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు గుంది రాజేష్, దుగ్గి చిరంజీవి, అల్లెం అశోక్, రైతు సంఘం జిల్లా నాయకులు తీగల ఆదిరెడ్డి, సామ చంద్రారెడ్డి, కడారి నాగరాజు, గుండు రామస్వామి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పొదిళ్ల చిట్టిబాబు రైతు సంఘం జిల్లా నాయకులు ఖ్యాతం సూర్యనారాయణ, సిఐటియు నాయకులు ఉపేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 06 Dec,2022 04:55PM