నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కార్యలయంలోని మిని కాన్ఫెరెన్స్ హాల్లో కమ్యూనిటి కాంటాక్ట్ లో భాగంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 66వ వర్ధంతి కార్యక్రమం మంగళవారం నిర్వహిండం జరిగింది. ఈ కార్యక్రమానికి అభ్యుదయ సోషల్ వర్కర్ నేషనల్ ఫిలోషిప్ అవార్డు గ్రహీత దళితరత్న బంగారు సాయిలు సౌజన్యంతో నిర్వహించగా ముఖ్య అతిధులుగా నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్, నాగరాజు, ఐ.పి.యస్. పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పువ్వుల మాలలు వేసి క్యాండిల్ వెలిగించి, 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది.
అనంతరం పోలీస్ కమీషనర్ కె.ఆర్ నాగరాజు మాట్లాడుతూ ప్రతి పౌరుడు భారత రాజ్యాంగము గురించి తెలుసుకోవాలని, ప్రతీ ఒక్కరు రాజ్యాంగాని ఆదర్శంగా తీసుకోవాలని, అన్ని వర్గాల ప్రజలు సమాజంలో గౌరవంగా జీవించాలంటే ప్రతి ఇంట్లో ప్రతీ ఒక్కరు విధ్య అభ్యసించి ఉండాలని. అందుకోసం ప్రతీ ఒక్కరు చదువు కోవాలని అప్పుడు ఆఇల్లు ఎంతో అభివృద్ధి సాదిస్తుందని, వారికి అన్ని రకాల హక్కులు, భాధ్యతలు తెలుస్తాయని అన్నారు. ప్రతీ ఒక్కరు ఎల్లప్పుడు చట్టాలను గౌరవిస్తు ఉండాలని, ఎవ్వరో ఎమెచెప్పారు అని ఎదో చేయకూడదని, అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే ప్రతీ పని నిర్వహించాలని, అందుకోసం భారత రాజ్యాంగములో గల చట్టాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని, ఎవ్వర యితే చట్టాలను గౌరవిస్తారో వారికి అన్నిరకాల రక్షణ ఉంటుందని అన్నారు.
మహిళా విధ్యార్ధినులు కూడా చదువులో ఎల్లప్పుడు ముందుడాలని ఆకాంక్షించారు.అనంతరం భారత రాజ్యాంగము తెలుగు ముద్రణ కలిగిన దాదాపు 200 పుస్తకాలు వితరణ కార్యక్రమం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు, ఐ.పి.యస్. చేతుల మీదుగా కాలేజీ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ధళిత జిల్లా నాయకులు బాబురావ్, బి.సి. సంఘం రాజేశ్వర్, ఎడ్ల రాములు, ఎస్.టి సంఘం అధ్యక్షులు శ్రీహరి నాయక్, మాలమహానాడు అధ్యక్షులు సక్కి విజయ్ కుమార్, నీలకంఠేశ్వర గుడి మాజీచైర్మన్ గోపు ప్రభాకర్ ప్రజాసంఘాల జె.ఎ.సి మాచల్ శ్రీనివాస్, రామచందర్ గైఖ్వాడ్, దళిత సంఘాల నాయకులు విధ్యార్థులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 06 Dec,2022 05:12PM