నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ నగర అభివృద్ది పై సీఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి నగరంలో అన్ని రకాల మెరుగైన మౌలిక సదుపాయాలు ప్రజలకు కల్పించాలని ఇప్పటికే ఖమ్మం పట్టణంలో ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలను పరిశీలించాలన్న ఆదేశాల మేరకు నగరంలో నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ చిత్ర మిశ్రా, అధికారులతో పర్యటించినట్లు నగర ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త తెలిపారు. వైకుంఠధామాన్ని పరిశీలించి అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ బర్నింగ్ మెషిన్ పనితీరు ఏర్పాటు చేసిన సదుపాయాల గురించి తెలుసుకోవటం జరిగినది. ఖమ్మం నగరంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ పనులను పరిశీలించారు.
గొల్లపాడు కెనాల్ అభివృద్ది పనులను పరిశీలించి మురికి కూపంగా ఉన్న పరిసరాలను చాల అందంగా ప్రజలు ఉపయోగపడే విధంగా పంచతంత్ర పార్క్, ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణాలుగా చేసిన పనులను పరిశీలించారు. ఖమ్మం పట్టణంలో ఉన్న ఐ టి హబ్ ను సందర్శించి కంపెనీల ప్రతినిధులతో మరియు స్థానికంగా ఉద్యోగాలు చేస్తున్న యువతతో అక్కడ ఉన్న సదుపాయాలు తెలుసుకున్నారు. ఖమ్మం లో నూతనంగా నిర్మించిన బస్ స్టాండ్ ను పరిశీలించారు. పట్టణంలో ఉన్న ట్యాంక్ బండ్ ను సందర్శించారు. ఎన్ఎస్పి కెనాల్ పాత్ వే ను సందర్శించారు.
ఈ స్టడీ టూర్ పై ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త మాట్లాడుతూ స్వరాష్టంలో అన్ని నగరాలు పట్టణాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని ఖమ్మం పట్టణంలో చేపట్టిన పనులన్నింటిని నిశితంగా పరిశీలించామని, ఆలోచలను, అభిప్రాయాలను పంచుకుంటూ నగరంలో అవకాశం ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటూ ఇక్కడ చేపడుతున్న పనులను నిజామాబాద్ నగరంలో అమలు పరిచే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని, ఈ రెండు రోజుల పర్యటనలో సహకరించిన జిల్లా కలెక్టర్ గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్, సుడా ఛైర్మెన్ బచ్చు విజయ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 06 Dec,2022 05:17PM