నవతెలంగాణ-గాంధారి
గాంధారి మండల కేంద్రములోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యా అధికారి సేవ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచ దివ్యంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల ప్రాదేశిక నియోజక వర్గం సభ్యులు రాజు రాష్ట్ర స్థాయి వరకు రన్నింగ్ కార్యక్రమంలో పాల్గొన్న శైలజ ను వెయ్యి రూపాయలు భాహుమానం చేశారు. మండల అభవృద్ధి అధికారి సతీష్ మాట్లాడుతూ పిల్లలకు సదరం సర్టిఫికేట్ విషయం లో తగుచర్యలుతీసుకుంటామనితెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యంపిపి రాధ బలరాం, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర గౌడ్ రిసోర్స్ టీచర్ పెంటయ్య, సాయన్న, ప్రకాష్, రాజు, సాయిలు వికలాంగుల తల్లి దండ్రులు తదితరులు పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm