నవతెలంగాణ-తాడ్వాయి
దుర్గమ్మ మల్లయ్య వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థినీ విద్యార్థులకు ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దుర్గం మల్లయ్య వెల్ఫేర్ సొసైటీ కన్వీనర్ డాక్టర్ సూరయ్య మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి ఆంగ్లభాష ప్రాముఖ్యతను కళాశాల విద్యార్థిని విద్యార్థులు సవివరంగా వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రానున్న భవిష్యత్ కాలంలో ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని మా యొక్క కళాశాల గ్రంథాలయమునకు అందజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, గ్రంథ పాలకులు రాములు, అధ్యాపకులు కిషన్, బిక్షం, రాజ్కుమార్, రాజు, అశోక్, శ్రీలత, నాగరాజ్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm