నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిదిలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలో ఐకేపీ అద్వర్యంలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్దేశించిన 5,500 క్వింటాళ్ల వరిధాన్యం కొనుగోల్లు పూర్తి చేయడంపై ఏపీఎం నర్సయ్య హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం కొనుగోలు కేంద్రాన్ని ఐకేపీ సిబ్బంది సందర్శించి పరిశీలించారు. సర్పంచ్ టేకు తిరుపతి, కొనుగోలు కేంద్రం నిర్వహాకులను అధికారులు అభినందించారు.