నవతెలంగాణ-నవీపేట్
బాబాసాహెబ్ అంబేద్కర్ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారని ఏబీపీ విద్యార్థి నాయకులు అఖిలేష్ అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి విద్యార్థులతో కలిసి పూలమాలలు వేసి మంగళవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. అణగారిన వర్గాలకు అంబేద్కర్ వల్లనే సామాజిక న్యాయం అందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నవనీత్, ప్రణయ్, యోగేష్, భూమేష్, కార్తీక్, శివ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm