నవతెలంగాణ-కంటేశ్వర్
దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న సాయుధ దళాల పతాక దినోత్సవమును నిజామాబాద్ జిల్లాలో తేది: 07.12.2022న ఉదయం 10.00 గంటలకు నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయము, నిజామాబాద్ జిల్లా యందు జరుపుకొనుటకు నిర్వహించినట్లు రమేష్, ప్రాంతయా సైనీక్ సంక్షేమా ఆదికారి నిజామాబాదు మంగళవారం ప్రకటనలో తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి నిజమాబాద్ జిల్లాలోని మాజీ సైనికులు / మాజీ సైనిక వితంతువులు, వారిపై ఆధారపడినవారు తప్పక హాజరై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా కోరనైనది. సరిహద్దులను కాపాడుటలో నిరంతరంగా సేవలను అందిస్తున్న సైనికులు, దేశరక్షణలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాన్ని స్మరిస్తూ వారి కుటుంబ సభ్యులకు, మాజీ సైనికులకు మరియు మాజీ సైనిక వితంతువులకు సంఘీభావాన్ని తెలుపుటకు ప్రజలలో చైతన్యం కలిగించుటకు నిర్వహిస్తున్న ఇట్టి కార్యక్రమములో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమమును విజయవంతం చేయవలసినదిగా తెలియచేయనైనది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 06 Dec,2022 05:44PM