నవతెలంగాణ-గోవిందరావుపేట
విద్యార్థులే ఉపాధ్యాయులై జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చల్వాయిలో మంగళవారం స్వయంపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. 2022-23 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఒకరోజు ఉపాధ్యాయులై పాఠశాల విద్యార్థులకు బోధన చేశారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వారికి కేటాయించిన తరగతుల బోధనలో నిమగ్నమై ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు బోధన చేశారు.
ఈ సందర్బంగా విద్యార్థులు వారి అనుభవాలను పంచుకున్నారు. పెండెల విజయ్ డి. ఈ.ఓ గా, బుద్దుల కార్తిక్ ఎం.ఈ.ఓ టి.సూర్య హెడ్ మాస్టర్ గా వ్యవహరించారు. విషయాల వారీగా బోధించిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు కుంజ రాజేశ్వర్ రావు చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మొలుగూరి రమేష్, ఉప్పుతల ప్రసాద్, చల్లగురుగుల మల్లయ్య, బూత్కూరి శ్యామ్ సుందర్ రెడ్డి, శ్రీరాముల శ్రీనివాసరావు, ముడుంబ వెంకటరమణమూర్తి, సుతారి మురళీధర్, భూక్య సరిత, పూసం శ్రీదేవి, రాయబారం దీప్తి, కొత్త వెంకటేష్ విద్యార్థులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 06 Dec,2022 05:47PM