నవతెలంగాణ-కంటేశ్వర్
అసమానతలను పారతోలిన ప్రధాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ అన్నారు. ఈ మేరకు మంగళవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని, టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఐ డి ఓ సి, టీఎన్జీవో కార్యాలయం నందు టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ వర్ధంతి వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేసి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి సంఘం అమృత్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై ఆ మహానుభావునికి నివాళులర్పించి, స్మరించుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm