నవతెలంగాణ-తాడ్వాయి
రాజ్యాంగ నిర్మాత, విశ్వ విజ్ఞాని, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 66వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం మండలంలోని కాటాపూర్ లో ఘనంగా నిర్వహించారు. బిఆర్ అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహణ వివిధ పార్టీల నాయకులు, కాటాపూర్ హెచ్ఎం లు జాఫర్ అలీ, పాయం మానేశ్వర్ రావు ల ఆధ్వర్యంలో కాటాపూర్ అంబేద్కర్ యువజన సంఘం గ్రామ కమిటీ అధ్యక్షులు గంగెలి విజయ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి అంబేడ్కర్ వాదులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అంటరానితనం, కులవివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసారని కొనియాడారు. ఆర్ధిక అసమానతలను తొలగించేందుకు ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకు రాజ్యాంగంలో హక్కులు కల్పించారని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం తుదిశ్వాస వరకు ఆయన పనిచేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ ఇందారపు బాలయ్య, మాజీ సర్పంచులు నరసయ్య, నర్సింహయ్య, మాజీ ఎంపిటిసి దానక నరసింహారావు, నాయకులు కోడి సతీష్, తడక హరీష్, వెంకటేశ్వర్లు, సమ్మయ్య, కరుణాకర్, నాగార్జున, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 06 Dec,2022 05:52PM