నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లోని పరిపాలనా భవనంలో మంగళవారం ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో డా.బి.ఆర్.అంబేడ్కర్ వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ డి. రవీందర్, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలను వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ దేశానికి చేసిన కృషి ని కొనియాడారు. అంబేడ్కర్ అందరికీ ఆదర్శ ప్రియుడని తెలిపారు. బీద కుటుంబం లో పుట్టి, కష్టపడి చదివి ప్రపంచ మంతటా పేరు సంపాదించుకున్నాడన్నారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ విద్యావర్థిని, డీన్, పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ అరుణ, డీన్,ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ కనకయ్య, డా బ్రమరాంబిక, డా ప్రవీణ్, సాయిలు, డా,సంపత్, రవీందరరెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయ గౌడ్, ఇంజనీరు వినోద్ కుమార్, అడ్మినిస్త్రిటివ్ ఆఫీసర్ ఖాదర్ మోహిన్ ఉద్దీన్, ఓట్సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.