నవతెలంగాణ-గోవిందరావుపేట
భారతరత్న, భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతిని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంగలో బహుజన్ సమాజ్ (బి ఎస్ పి) ఆధ్వర్యంలో, మండల అధ్యక్షులు కోగిల అజయ్ కుమార్ అధ్యక్షత అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ జీవిత ప్రయాణం మొత్తం, మనుష్యులఅందరూ ఈ కుల, మతాలకు, అతీతంగా భారతదేశ సంపదను, రాజకీయ హోదలను, పదవులను, అందరూ సమానంగా అనుభవిస్తూ,స్వేచ్ఛగా జీవించాలనే ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు సాగిందన్నారు. అనేక, అనేక హక్కులను, రాజ్యాంగం రూపంలో మన అందరికి అందరికి అందించిన మహోన్నత వ్యక్తి అంబెడ్కర్, అదే విధంగా అంబెడ్కర్ అందించిన ఓటు హక్కును సరైన పార్టీలకు, వేక్తులను ఎన్నుకోవడానికి వినియోగించుకోవాలని, మద్యానికి, డబ్బుకు అమ్ముడుపోకుండా పూర్తిగా ఆలోచించి, రాజకీయ చైతన్యం, ఓటు హక్కును వినియోగించుకునే శక్తి మన దినసరి కూలీలకు, మధ్యతరగతి ప్రజలకు ఆ ఓటు చైత్యనం వచ్చిన రోజు మాత్రమే అంబేద్కర్ ఆశయాలు నీరవేరుతాయని అన్నారు.
బీ.ఎస్.పి ములుగు, అసెంబ్లీ అధ్యక్షులు పసులది ముఖేష్, గోవిందరవుపేట సర్పంచ్ లావుడ్యా లక్మి, జోగ నాయక్ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ ఫలితమే మా ఈ పదవులు అని ఆయనకు ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం రుణపడి ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేశారు. భారతరాజ్యాంగమే బహుజన్ సమాజ్ పార్టీ మ్యానిఫెస్టో అని అంబెడ్కర్ కలలు కన్న బహుజన రాజ్యాన్ని సమానత్వంతో రాజ్యన్ని ఏర్పాటుచేసే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని అన్నారు. డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆ కలను తెలంగాణ రాష్టంలో నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు డొంక చిన్ని, పసర సెక్టర్ అధ్యక్షులు సంగి శివ, మాల్యాల ప్రకాష్, బి.వి.ఎఫ్ మండల నాయకులు గడ్డం ప్రవీణ్, బెజిగం శ్రీహరి, సురేష్, నాగరాజు, బొడ్డు, నవీన్, జంగిడి కిషోర్, మామిడి శేఖర్, శరత్, క్రాంతి, రవితేజ, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 06 Dec,2022 06:09PM